రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జల శక్తి శాఖ, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని హెచ్చరించింది.
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం (నవంబర్ 29) అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
నైరుతి ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనమైనప్పటికీ, ఆహార్యం వాతావరణశాఖ అంచనా ప్రకారం, రేపు (నవంబర్ 14) ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు అల్పపీడనంగా మారింది, కానీ ఈ అల్పపీడనం కూడా మరింత బలహీనపడి ఆవర్తనంగా మారిపోయింది. వాతావరణశాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణమధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాగాల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి శ్రీలంక మరియు దక్షిణ తమిళనాడు…
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టమునకు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒక అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉంది ,తరవాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరుకుంటుంది. పశ్చిమ మధ్య మరియు దానిని…