రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల…