MP Putta Mahesh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుంది అనే భరోసా వచ్చింది అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన. పరిశ్రమల రంగంలో వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందని, వారి అధికార కాలంలో ఒక్క పరిశ్రమలకు సంబంధించిన M.O.U కూడా జరగలేదని మండిపడ్డారు. అయితే, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పరిశ్రమల…
Minister Lokesh: ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందని తెలిపారు. అనేక పెద్ద పరిశ్రమలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఇప్పుడు ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంది. గత ఒక సంవత్సరం కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలను అందించగలిగాం. పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడానికి అనుకూల వాతావరణం, వేగవంతమైన సదుపాయాలు, ప్రభుత్వంతో…
Investments in Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడుల జోరు మళ్లీ మొదలుకానుంది. రాబోయే సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025లో రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే ఒప్పందాలు (MOU)లు కుదిరినట్లు సిఆర్డిఎ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఈ సమ్మిట్ విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరగనుంది. ఈ పెట్టుబడులు ప్రధానంగా పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతులు వంటి విభాగాల్లో రానున్నాయి. అమరావతిని సుస్థిర నగర అభివృద్ధి కేంద్రంగా, అంతర్జాతీయ భాగస్వామ్యాల హబ్‌గా…
CM Chandrababu: ఇవాళ లండన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు.
CM Chandrababu: దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు రెస్పాండ్ అయ్యారు. సీఎం ప్రజెంటేషనుకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు.
CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో మొదటి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్. రామకృష్ణన్, అలాగే బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో కీలక చర్చలు జరిపారు. World Cup 2025: సెమీఫైనల్ రేసు రసవత్తరం.. న్యూజిలాండ్‌తోనే భారత్‌కు ముప్పు! శ్రీలంక ఉన్నా ట్రాన్స్ వరల్డ్ గ్రూప్…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఈరోజు (అక్టోబర్ 21) నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు.
Nara Lokesh Australia Tour: ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు.. కీలకమైన పెట్టుబడులకు గమ్య స్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్ మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు లోకేష్..
Minister Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో పరుగులు తీస్తోంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గా విశాఖ ఆవిర్భవిస్తుంది.. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తుంటే 50శాతం విశాఖకే వస్తున్నాయి.. విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని పేర్కొన్నారు.
వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు.