MP Putta Mahesh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుంది అనే భరోసా వచ్చింది అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన. పరిశ్రమల రంగంలో వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందని, వారి అధికార కాలంలో ఒక్క పరిశ్రమలకు సంబంధించిన M.O.U కూడా జరగలేదని మండిపడ్డారు. అయితే, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పరిశ్రమల అభివృద్ధిలో ఉన్న పాత్ర అపారమైనది ప్రశంసించారు.. ఇండియాలో పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ విండో సిస్టమ్‌ను తీసుకు వచ్చిన ఘనత పూర్తిగా చంద్రబాబు నాయుడిదే అని ప్రశంసించారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం ఆయన నాయకత్వంలోనే సాధ్యమైందని తెలిపారు.
Read Also: Akhanda2Thaandavam : అఖండ – 2.. జాజికాయ.. జాజికాయ.. నువ్వే నా ఆవకాయ..!
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమల ఏర్పాటు తప్పనిసరి… పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి అన్నారు ఎంపీ పుట్టా మహేష్.. పరిశ్రమలు వస్తేనే ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగాలు వస్తాయి.. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఇక, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మోడల్ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను సృష్టించబోతుందని చెప్పారు. ఏపీలో భవిష్యత్తులో లక్షలాది మంది యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నమ్మి పెట్టుబడిదారులు రాష్ట్రంలోకి రావడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాల ప్రజలు కూడా మన రాష్ట్రానికి వచ్చి పని చేసే స్థాయి ఏర్పడుతుంది అని పుట్టా మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.