Scrub Typhus: తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్‌సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
AP: ఇవాళ చలో విజయవాడ మహాధర్నా యథాతథంగా కొనసాగుతుందని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నాట్లు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా సాగనుంది. రూ.2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆషా డిమాండ్ చేస్తోంది.. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 250 కోట్లతో సరిపెట్టుకోలేం అంటున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్..