ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. మొత్తం 5 గంటల 24 నిమిషాలు పాటు సభ జరిగింది.. ఏడు బిల్లులకు ఆమోదం లభించింది.. ఒక్క బిల్లును ఉపసంహరించుకోంది ప్రభుత్వం.. ఇక, రెండు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం.. కర్నూల్ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలంటూ మరో తీర్మానం ప్రవేశపెట్టగా.. రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా సభ ఆమోదించింది.…