ఈరోజు హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించాయి. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్పటికే తన నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్వవస్థీకరణ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.…
ఏసీబీ అధికారులంటే టక్ చేసుకుని, హుందాగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల భరతం పడతారు. కానీ ఆ అధికారులు మాత్రం రొటీన్ కి భిన్నంగా వ్యవహరించారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ అంటూ రైతుల వేషంలో లుంగీలతో మార్కెట్ యార్డులోకి ఎంటరయ్యారు. అక్కడ జరుగుతున్న తంతు అంతా స్కాన్ చేశారు. ఆ తర్వాత రికార్డులు, నగదును పట్టుకోవడంతో వచ్చింది ఎవరనేది వారికి అర్థమయింది. అనంతపురం మార్కెట్ యార్డులోకి ముగ్గురు వ్యక్తులు…
అనంతపురంలో దారుణం చోటుచేసుకొంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోందని భర్త మెనూ రోకలి బండతో తలపై మోది హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో శివశంకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం నుంచి భార్య హేమలత, రామాంజనేయులు…
మరో రెండు గంటల్లో ఆ జంటకు పెళ్లి.. పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. కొత్త జీవితాన్ని ఉహించుకొని వధువు ఎన్నో కలలు కట్టుంది. అంతలోనే వరుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేముంది ఆ షాక్ నుంచి తేరుకోనేలోపు ఇరు కుటుంబాలకు చెప్పకుండా వరుడు జంప్ అయిపోయాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోయిన ఘటన అనంతపురంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువతితో…
అనంతపురంలోని SSBN కళాశాలలో చోటు చేసుకున్న ఘటన పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా ర్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యా ర్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేశారన్నారు మంత్రి సురేష్. ఈ సంఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామన్న ఆయన..…
పోలీసు పరాక్రమాలు తెలియజేసే ” క్రాక్ ” చిత్రాన్ని అనంతపురం త్రివేణి కాంప్లెక్స్ లోని బిగ్ సి థియేటర్ లో ప్రదర్శించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శింపజేశారు. దీంతో వందలాది మంది విద్యార్థులతో బిగ్ సి థియేటర్ కిటకిటలాడింది. ఈ చిత్రంలో హీరో రవితేజ పోలీసు అధికారిగా పరాక్రమ విధులు నిర్వర్తించడం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. ఈ చిత్ర ప్రదర్శన కార్యక్రమంలో…
కన్నతండ్రి అంటే కనుపాపలా కాపాడాలి. కష్టమొస్తే దానిని తీర్చాలి. కానీ ఆ కన్నతండ్రి కాలయముడిలా మారాడు. రెండునెలలయినా నిండని చిన్నారిపై ప్రతాపం చూపించాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున, చెట్టెమ్మలకు రెండు నెలల చిన్నారి ఉంది. చిన్నారికి ఆరోగ్యం బాగాలేదు. గురువారం సాయంత్రం చిన్నారిని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు దంపతులు. భార్యను ఆస్పత్రి దగ్గర ఉండమని చెప్పి చిన్నారిని తీసుకొని భర్త…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లాలోని నల్ల చెరువులో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చానని అన్నారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయాల్లోనే ఉంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీ నాయకులు తనకు శతృవులు కాదని, అద్భతమైన పాలన ఇచ్చి ఉంటే ఇలా…
అనంతపురం జిల్లాల్లో గుప్తనిథుల కోసం తవ్వకాలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. పాత ఆలయాలు, పాత గృహసముదాయాలు కనిపిస్తే చాలు మూడో కంటికి తెలియకుండా గుప్తనిథుల వేటగాళ్లు తవ్వకాలు జరుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని యాడికి మండలంలోని పుష్పాల-చింతలచెరువు ప్రాంతంలోని సుంకలమ్మ గుడికి సమీపంలో ఉన్నపాత బురుజు ప్రాంతంలోని పొలంలో రాత్రి సమయంలో తవ్వకాలు జరిపారు. అయితే, రాత్రి సమయంలో పొలం నుంచి వింత శబ్దాలు రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి చూసి షాక్…