కన్న కూతురిపై తండ్రి ప్రతాపం.. ఏంచేశాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నతండ్రి అంటే కనుపాపలా కాపాడాలి. కష్టమొస్తే దానిని తీర్చాలి. కానీ ఆ కన్నతండ్రి కాలయముడిలా మారాడు. రెండునెలలయినా నిండని చిన్నారిపై ప్రతాపం చూపించాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున, చెట్టెమ్మలకు రెండు నెలల చిన్నారి ఉంది. చిన్నారికి ఆరోగ్యం బాగాలేదు. గురువారం సాయంత్రం చిన్నారిని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు దంపతులు. భార్యను ఆస్పత్రి దగ్గర ఉండమని చెప్పి చిన్నారిని తీసుకొని భర్త బయటకు వెళ్ళాడు,
ఎంత సేపైనా భర్త తిరిగి రాలేదు. నాలుగు గంటలైన చిన్నారి జాడ తెలియలేదు. భర్తపై అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి, తండ్రి జాడ గురించి దర్యాప్తు చేశారు. ఐదుకల్లు గ్రామానికి వెళ్లే రహదారి లో చిన్నారి కోసం వెతకడం మొదలు పెట్టారు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ఆ చిన్నారిని తీసుకెళ్లినపుడు ఉన్న టవల్ తదితర వస్తువులు పక్కనే ఉన్న చెరువు దగ్గర లభ్యం అయ్యాయి. , చెరువులో గాలింపు చేపట్టగా చిన్నారి మృతదేహం ఒక గోనెసంచిలో లభ్యం అయింది. బయటకు తీసిన పోలీసులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని చూసిన తల్లి బోరున విలపించింది. ఈ ఘోరానికి పాల్పడిన తండ్రిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. నిందితుడు మల్లికార్జునను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన అనంతపురంలో సంచలనం కలిగించింది.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..