ఆనందయ్య మందుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలలో పరిశోధన కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు వైద్యలు. నిన్నటి రోజున 190 మందికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. అయితే, ఫోన్ ద్వారా వివరాలు సేకరించే సమయంలో వైద్యులకు సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్యకార్యకర్తల నెంబర్లు ఇచ్చినట్టు వైద్యుల…
కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు నిలిపివేసినా.. బ్లాక్ లో మాత్రం దందా కొనసాగుతోంది. హైదరాబాద్ కు చెందిన రవి బంధువుల కోసం ఐడ్రాప్స్ రూ. 20,000కు భేరం అడినట్లు సమాచారం. ఉచితంగా ఇచ్చే దానికి రూ. 20,000 ఎందుకు అని రవి స్నేహితుడు సాయి ప్రశ్నించగా.. డబ్బులు లాక్కుని కృష్ణ పట్నం నాగరాజు పరారయ్యాడు. దీంతో పోలీసులకు సాయి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మందు హానికరం కాదని నివేదిక రావడంతో మరింత…
ఆనందయ్య తయారు చేసిన మెడిసిన్ ఆయుర్వేదమా కాదా అని నిర్ధారించేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ సంస్థ ఈ మెడిసిన్ పై అద్యయనం మొదలుపెట్టింది. ఈ మెడిసిన్ వినియోగించిన వస్తువులు అన్నీ కూడా ఆయుర్వేదంలో వినియోగించే వస్తువులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ మెడిసిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవని ఆయుష్ తెలిపింది. అయితే, ఐసీఎంఆర్ నిపుణులు ఈ మందును పరిశీలించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మందును ఐసీఎంఆర్ పరిశీలించాల్సిన అవసరం…
ఆనందయ్య మందును ఆయుర్వేధంగా గుర్తించే అవకాశం ఉన్నట్టు ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆనందయ్య మందుపై తుది అధ్యయనం జరుగుతోందని, నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేధంగా గుర్తించవచ్చని రాములు పేర్కొన్నారు. ఆనందయ్య మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో వినియోగించేవే అని, ఆయుర్వేధంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో ఉందని, కానీ కేంద్రం సాయం తీసుకుంటామని రాములు పేర్కొన్నారు. అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది కాబట్టి ప్రస్తుతానికి ఆనందయ్య మెడిసిన్ ను ఆయుర్వేధంగా గుర్తించలేమని ఆయుష్…
కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య. అయితే ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. రేపు సాయంత్రం నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం రానుంది. అయితే నిన్నటి నుండి నెల్లూరులోనే ఆయుష్ బృందం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆనందయ్య కరోనా మందును సోమవారం ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు కలిసి పరిశీలించనున్నాయి. ఈ రెండు బృందాల పరిశీలన తర్వాత మందు పంపిణీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక తాజాగా ఆనందయ్యను…