జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగిక దాడి కేసులో నిందితుల పేర్లను వెంటనే బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఐదుగురు అమ్మాయిపై లైంగిక దాడి చేశారు.. దీనిపై గత నెల 28న అమ్మాయి ఫిర్యాదు చేస్తే మే 31 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మూడు రోజుల ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. సామూహిక లైంగిక దాడి కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల కొడుకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని…
ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగికదాడిలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. హోంమంత్రి మహమూద్ అలీ మనవడే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు చేశారు. పబ్ లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి, వక్ఫ్ బోర్డు పెద్దమనిషి కొడుకు, ఓల్డ్ సిటీ ప్రముఖ పత్రికా డైరెక్టర్ కొడుకుతో పాటు హోం మంత్రి పీఏగా చెప్పుకుంటున్న హరి సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తున్నారని.. కారు ఎవరిది,…