ప్రియాంకాగాంధీ.. పరిచయం లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
కాంగ్రెస్ అధిష్టానం ఊరించి.. ఊరించి ఎట్టకేలకు శుక్రవారం ఉదయం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Congress: కాంగ్రెస్ కంచుకోటలైన అయేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఆ పార్టీ ఇంకా ఎటూ తేల్చడం లేదు. శుక్రవారంతో నామినేషన్ గడువుకు ముగుస్తున్న నేపథ్యంలో, అభ్యర్థి ఎవరనేదాన్ని కాంగ్రెస్ చెప్పడం లేదు
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ సాగుతోంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు ప్రత్యేకం కావడమే కారణం.
Congress: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై నాన్చుతూనే ఉంది. మరోవైపు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది.
అమేథీ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను కేంద్రమంత్రి సమర్పించారు.
శనివారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.