ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలు మీ కాలనీకే కంటి వెలుగు వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అమీర్ పేటలో ఇవాళ రెండో విడత కంటి వెలుగును మంత్రులు హరీష్, తలసాని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Allu Arjun Multiplex: మొన్న మహేష్ బాబుతో కలసి ఏఎంబీ సినిమాస్, నిన్న విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్‌ను ఆరంభించిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ అల్లు అర్జున్‌తో కూడా చేతులు కలిపిన విషయం తెలిసిందే. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ దిగ్గజంగా పేరున్న ఏషియన్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలంగాణలో మెజారిటీ థియేటర్లను కలిగిఉంది. ఏషియన్ గ్రూప్ ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌తో పాటు అనేక సింగిల్ స్క్రీన్‌లను సొంతంగా నిర్మించటమో లేక లీజ్ కు తీసుకుని ఉండటమో చేస్తోంది.…
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో వాతావణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి సూర్యకిరణాలు తాకిడికి అల్లాడిన భాగ్యనగర వాసులకు ఒక్కసారిగా వాన జల్లుతో నగరం తడిసి ముద్దైంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పండింది. నిన్న కూడా మధ్యాహ్న సమయంలో వర్షం పడటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. అమీర్ పేట్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, యూసుఫ్ గూడ, మాధాపూర్, పంజాగుట్ట, దిల్‌షుక్‌నగర్, బంజారాహిల్స్ పలు పాంత్రాలల్లో భారీ వర్షం కురుస్తోంది. రేపుకూడా జల్లులతో…
నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జరిగే ఈ కార్యక్రమం కోసం సర్వాంగ సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దారు. కాగా.. బోనం కాంప్లెక్స్‌ను పరిశుభ్రం చేస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన కల్యాణ మండపం ఎదుట, వెనుక రోడ్లను బ్లాక్ చేసి క్యూలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. నిన్న సోమవారం నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా.. భారీగా వర్షం కురిసినా భక్తులు తడవకుండా ఉండేందుకు షామియానాలు, చలువ…
కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగం అంటూ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవ చేశారు. అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గీతారెడ్డి, జంగారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారని ఎద్దేవ చేశారు. గీతారెడ్డి…