Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో వాతావణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి సూర్యకిరణాలు తాకిడికి అల్లాడిన భాగ్యనగర వాసులకు ఒక్కసారిగా వాన జల్లుతో నగరం తడిసి ముద్దైంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పండింది. నిన్న కూడా మధ్యాహ్న సమయంలో వర్షం పడటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
అమీర్ పేట్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, యూసుఫ్ గూడ, మాధాపూర్, పంజాగుట్ట, దిల్‌షుక్‌నగర్, బంజారాహిల్స్ పలు పాంత్రాలల్లో భారీ వర్షం కురుస్తోంది. రేపుకూడా జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..