అసలే హైదరాబాద్.. రోజూ సవాలక్ష కేసులు. వీటికి తోడు డ్రగ్స్, పబ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటారు పోలీసులు. నగరం నడిబొడ్డున వున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అయితే చెప్పాల్సిన పనిలేదు. వీఐపీలు ఎక్కువగా వుండే ఏరియాలో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులు అలర్ట్ కావాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పబ్ లలో మైనర్ల పార్టీలు వంటి తలనొప్పులు వుండనే వుంటాయి. తాజాగా ఓ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అచ్చం సినిమా తరహాలో ఓ కుక్క కనిపించడం లేదని యజమాని కంప్లైంట్ ఇచ్చారు.
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల (పప్పీ) కనపించకుండా పోయిందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో దాని యజమాని ఫిర్యాదు చేశారు. అమీర్ పేట నాగార్జున నగర్ కు చెందిన దంపతులు పప్పీని ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్నారు. రెండు నెలల పప్పీ ఇంటి బయట ఆడుకుంటూ వుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని వెళ్లారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సైతం పోలీసులకు అందజేశారు. పప్పీని కనిపెట్టి తమకు అందించాలన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఇంతకీ ఆ కుక్క ఎంత క్యూట్ గా వుందో చూడండి. మీకు కనిపిస్తే గనుక పంజాగుట్ట పోలీసులకు తెలియచేయండి. ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Prudhvi Raj: ఆమె వల్లే ఈరోజు బతికి ఉన్నాను