భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సామాన్యుడి దగ్గర నుంచి మేధావుల వరకు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తొలుత 25 శాతం టారిఫ్ పెంచగా.. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకాన్ని ట్రంప్ పెంచారు. దీంతో పలు రంగాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి.
Amazon: సాంకేతిక రంగంలో అగ్రగామి అమెజాన్ మరోసారి పెద్ద సంచలనం సృష్టించింది. రోజంతా వినిపించే మాటలను నోట్లుగా మార్చే ప్రత్యేక వెయిరబుల్ పరికరాన్ని తయారు చేసిన Bee AI స్టార్టప్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది. సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ రూపొందించిన Bee Pioneer అనే గ్యాడ్జెట్ ఇప్పటికే వినియోగదారుల్లో మంచి హడావుడి సృష్టించింది. $49.99 (సుమారు రూ. 4,000) ధరలో లభ్యమయ్యే ఈ పరికరం రోజువారీ సంభాషణలను రికార్డ్ చేసి, సారాంశాలు తయారు చేస్తుంది.…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా రెండో భాగం రూపొందుతోంది. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్లో సింహభాగం పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. ‘అఖండ’ సూపర్ హిట్ కావడం, ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాను దక్కించుకునేందుకు ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి. Also Read:…
ప్రపంచంలో ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే సంస్థ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలోని రెండు ప్రధాన కేసులైన 2019 పుల్వామా దాడి, 2022 గోరఖ్‌నాథ్ ఆలయ దాడిని ఎఫ్ఏటీఎఫ్ ప్రస్తావించింది. ఈ సంఘటనలలో ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది. పుల్వామా దాడిలో ఐఈడీ (IED)…
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ…
ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరిస్ లను సెన్సార్ చేయాలని ఎప్పటినుండో డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని లీడింగ్ ప్లాట్ ఫామ్స్ లో హాలీవుడ్ కు చెందిన వెబ్ సిరీస్ లో సెక్సువల్ కంటెంట్ ను ఎటువంటి వార్నింగ్ నోట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ప్రసారం చేస్తున్నారని ఎప్పటినుండో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సెక్సువల్ కంటెంట్ పై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.…
ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ గెట్ రెడీ.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చే్స్తోంది. కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 త్వరలో భారత్ లో ప్రారంభం కానుంది. ఈ-కామర్స్ సైట్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ప్రకటించింది. స్మార్ట్ఫోన్ల నుంచి పర్సనల్ కంప్యూటర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. Also Read:Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో భయం భయం.. కుటుంబాలను యూకే తరలిస్తున్న అధికారులు..…
US India trade deal: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల అధికారులు విస్తృతంగా పనిచేస్తున్నారు. ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’ నిర్ణయంతో భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్‌కి ప్రాధాన్యత ఇస్తోంది. ఇదిలా ఉంటే.. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి ఆన్లైన్ రిటైలర్లకు భారత మార్కెట్లో పూర్తి ప్రవేశాన్ని ఇవ్వాలని మన దేశంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, లాబీయిస్టులు, యూఎస్ ప్రభుత్వ అధికారుల్ని ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం…
Amazon Project Kuipe: అమెజాన్ తన ప్రాజెక్ట్ ‘కైపర్’ కింద 27 కొత్త ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ఏప్రిల్ 10న యునైటెడ్ లాంచ్ అలయన్స్ (ULA) అట్లాస్ V రాకెట్ ద్వారా జరగనుంది. ప్రాజెక్ట్ కైపర్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలలో వీటిని అందుబాటులోకి తీసుకరావడమే. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి జరగనుంది. ఈ ప్రయోగాన్ని…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై సోదాలు నిర్వహించింది. బిఐఎస్ చట్టం, 2016 నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు, సీజ్ ఆపరేషన్ నిర్వహించారు. డైరెక్టర్ & హెడ్ శ్రీ పి వి శ్రీకాంత్ ఆదేశాల మేరకు.. జాయింట్ డైరెక్టర్ రాకేష్ తన్నీరు నేతృత్వంలో, SPO అభిసాయి ఎట్టా డిప్యూటీ డైరెక్టర్ కవిన్ కె, JSA శివాజీలతో…