Amazon Lays Off: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలతో వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది చివరి నుంచి ప్రారంభం అయిన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ వీడియో గేమ్ విభాగం 100 మంది ఉద్యోగులను తొలగించింది.