ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(61), ప్రియురాలు, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ (55) వివాహం అట్టహాసంగా జరిగింది. 200 మంది అత్యంత ప్రముఖుల మధ్య ఇటలీలోని వెనిస్‌లో పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సాంచెజ్ పోస్ట్ చేశారు.
ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్ మస్క్.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..!
Amazon founder warned about recession: సొమ్ములే ఆదా.. చెయ్యరా భాయి.. డాబుకే పోక.. డబ్బు పోగెయ్యి.. అని తెలుగు రచయిత చంద్రబోస్ 20 సంవత్సరాల క్రితమే బడ్జెట్ పద్మనాభం అనే మూవీ కోసం ఒక చక్కని పాట రాశారు. అమేజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎకానమీ ఏమంత బాగా లేదని, అందుకే అన్ని రంగాల్లోనూ ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఆర్థిక సంక్షోభం సవాళ్లు విసురుతోందని చెప్పారు.