ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(61), ప్రియురాలు, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ (55) వివాహం అట్టహాసంగా జరిగింది. 200 మంది అత్యంత ప్రముఖుల మధ్య ఇటలీలోని వెనిస్‌లో పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సాంచెజ్ పోస్ట్ చేశారు. ఆమె తెల్లటి లేస్ గౌను ధరించగా.. బెజోస్ క్లాసిక్ టక్సేడోలో కనిపించారు. ఇద్దరూ కూడా చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించారు.
ఇది కూడా చదవండి: Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ జరివాలా మృతి!
ఈ వేడుక శాన్ జార్జియో మాగియోర్ అనే పచ్చని ద్వీపంలో జరిగింది. వెనీషియన్ సరస్సు మీదుగా డోగేస్ ప్యాలెస్ కనిపిస్తోంది. అత్యంత సన్నిహితులు.. ప్రియమైన అతిథులు దాదాపు 200 మంది మోటార్ బోట్ ద్వారా ప్రత్యక్షమయ్యారు. కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే వంటి హాలీవుడ్ ప్రముఖుల హాజరయ్యారు. మూడు రోజుల పాటు చాలా గ్రాండ్‌గా ఈ వివాహ వేడుకలు జరిగాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు.. నేడు జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ ధర్నా..
ప్రముఖ ఒపెరా గాయకుడు ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి తన గానంతో నూతన వధూవరులను, అతిథులను అలరించారు. మిషెలిన్-స్టార్ చెఫ్ ఫాబ్రిజియో మెల్లినో పెళ్లి విందును సిద్ధం చేయగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ పేస్ట్రీ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ కేక్‌ను తయారు చేశారు.