ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ ముఖ్య అతిథిగా హాజరయిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్టీఆర్ గురించి పనిలో పనిగా చంద్రబాబు విజనరీ గురించి మాట్లాడారు. ఈ వ్యవహారం కాస్త వివాదంగా మారింది. రజనీకాంత్ పై వైసీపీ నేతలు మండిపడ్డారు. రజనీకాంత్ ని చెడామడా తిట్టేశారు. రజనీకాంత్ కి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ కామెంట్ చేశారు. అసలు రజనీకాంత్ కు మేమెందుకు క్షమాపణ చెప్పాలన్నారు.
Read Also: Shock To Tdp Leaders: అనుమతి లేకుండా స్టిక్కర్లు .. తాడపత్రిలో టీడీపీ నేతలకు చుక్కెదురు..
చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అవాస్తవాలనే మేం వ్యతిరేకించామ్….సినిమాల్లో మాదిరిగా ఎవరినైనా ఏమైనా అంటాం అంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయవలిసిందే…..దొంగ,హంతకుడు పెట్టిన సభకు వచ్చి పొగడ్తలు కురిపిస్తే చూస్తూ ఊరు కోవాలా…..? సినిమాల్లో మాత్రమే రజనీకాంత్ సూపర్ స్టార్…..ఒక సారి చెబితే వంద సార్లు చెప్పినట్టు ఫీల్ అవ్వడానికి రాజకీయాలు సినిమా కాదు….ఈ విషయం అర్థం అయ్యే పార్టీ విషయంలో రజనీకాంత్ వెనక్కి తగ్గారు అనుకుంటున్నా అన్నారు మంత్రి అమర్నాథ్. వెన్నుపోటులో కుట్రదారుడు చంద్రబాబు…. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రాగా మార్చిన చరిత్ర టీడీపీదే అన్నారు.
ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు. తాపీమెస్ట్రీ, శిలా ఫలకం ఉంటే ఎంత భారీ ప్రాజెక్ట్ అయిన కట్టేయగల ఘనుడు చంద్రబాబు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో 2025నాటికి తొలి ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులో వచ్చే నాటికి విశాఖ-భోగాపురం మధ్య 6,500కోట్ల రూపాయలతో 6లైన్స్ రహదారి నిర్మాణం పూర్తి చేస్తాం. శిలాఫలకాలు వేసిన ప్రాజెక్టులు అన్నీ నేనే తెచ్చానని టీడీపీ, చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో ప్రధాన రన్ వే నిర్మాణం జరిగే భూమి లిటిగేషన్ లో ఉంటే క్లియర్ చేసింది మా ప్రభుత్వమే. పునరావాసం, భూ సమీకరణ, ఆర్ధిక వనరులు సమీకరబ జరగకుండానే చంద్రబాబు శంకుస్థాపన పేరుతో హడావిడి చేశారని మండిపడ్డారు మంత్రి అమర్నాథ్.
Read Also: Dasari Jayanthi: సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్