Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి.
బుల్లితెర నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ ఇప్పుడు వెండితెరపైనా అలరిస్తున్నాడు. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'అభిలాష' ట్రైలర్ విడుదలైంది.