Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి. బిగ్ బాస్ మొదలై వారం దాటిపోయింది. ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. ఎంతో ఉత్సాహంతో వెళ్లిన అమర్.. నీరుగారిపోయాడు. యాక్టివ్ గానే కనిపించలేదు. గేమ్స్ లో కూడా అంతంత మాత్రంగానే ప్రయత్నించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని అభిమానులను నిరాశపరిచాడు అని చెప్పాలి. ఇక పోయినవారం నాగార్జున కూడా అదే చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ లో అమర్ దీప్ ఉన్నాడా.. ? లేడా ..? అని అడగడంతో అతను.. ఇకనుంచి యాక్టివ్ గా ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక చెప్పినట్లుగానే అమర్ దీప్ రంగంలోకి దిగాడు.
Ileana : టాలీవుడ్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..
గతరాత్రి జరిగిన నామినేషన్ లో ఏదైనా హైలైట్ ఉంది అంటే అది.. అమర్ దీప్- పల్లవి ప్రశాంత్ ల నామినేషన్ అనే చెప్పాలి. పల్లవి ప్రశాంత్ ను ఏకిపారేశాడు.. రైతుబిడ్డ అని సింపతీ సంపాదించుకోవడానికి కష్టపడుతున్నాడని, అతనిలానే మేము కూడా వచ్చామని ఫైర్ అయ్యాడు. ప్రశాంత్ కు రెండు ముఖాలు ఉన్నాయని, రైతుబిడ్డ అనే పదం లేకుండా గేమ్ ఆడమని చెప్పుకొచ్చాడు. అంతేనా బీటెక్ స్టూడెంట్స్ కష్టాల గురించి, సీరియల్స్ కష్టాల గురించి ఓ రేంజ్ లో స్పీచ్ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కుర్రాడు .. ఒకే ఒక్క నామినేషన్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాడు. ఈ నామినేషన్ తరువాత అమర్ దీప్ గేమ్ మారుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి అమర్ దీప్.. బిగ్ బాస్ లో ఎప్పటివరకు ఉంటాడో చూడాలి.