ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు.హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన అధికారిక వేడుకల్లో గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ, సెంట్రల్…