అమలాపురం వ్యవహారంలో మంత్రుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోం మంత్రి వనిత మా పేరు వివాదంలోకి లాగారు. హోం మంత్రి వ్యాఖ్యలకు మేం ఆశ్చర్యపోతున్నాం. తల్లి పెంపకం సరిగా ఉండాలంటూ హోం మంత్రి కామెంట్ చేశారు. ఆరేళ్ల బిడ్డ కూడా అత్యాచారానికి గురైతే తల్లుల పెంపకమే తప్పా..? ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. దళితులపై దాడులు జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్-1గా నిలిచిందని రామ్ దాస్ అథవాలే స్వయంగా…
అమలాపురంలో జరిగిన విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వాళ్ల నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆందోళనలు, విధ్వంసంలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఉంది.. జరిగిన సంఘటన తీరు, ప్రతిపక్ష నాయకుల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు.. అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని మండిపడ్డ ఆయన.. పోలీసులు సంయమనం…
కోనసీమ జిల్లాకి అ౦బేద్కర్ పేరు పెట్టడానికి అన్ని పార్టీలు అ౦గీకరి౦చాయని ప్రభుత్వం మాకు ఏమైనా లేఖ ఇచ్చి౦దా..? అని ప్రశ్నించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమలాపురంలో ప్రభుత్వం ఓ చర్చకి తెరలేపి౦ది.. ప్రభుత్వానికి మారణ హోమం జరగడం కావాలని ఆరోపించారు. అమలాపురంలో వాళ్లే అంతా చేశారన్నా ఆశ్చర్య పోనక్కరలేదన్న ఆయన.. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో చేశారని మండిపడ్డారు.. కోనసీమలో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న బీజేపీ…
అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000…