అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి.
Alphabet Layoffs: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈసారి వందలాది మంది ఉద్యోగులను తొలగించారు. టెక్ దిగ్గజం గ్లోబల్ రిక్రూట్‌మెంట్ టీమ్ నుండి ఉద్యోగులను తొలగించింది.
గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కి లేఖ రాశారు. గూగుల్ మాతృసంస్థ అల్భాబెట్‌లో పనిచేసే 1400 మందికిపైగా ఉద్యోగులు.. పలు డిమాండ్లను సీఈఓ సుందర్ పిచాయ్ ముందు ఉంచారు.
Google Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ కూడా ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ శుక్రవారం ఓ మెమోలో తెలిపారు. మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు…
Google is in the process of laying off employees: ఐటీ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. వరసగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు అదే బాటలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా చేరబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది గూగుల్ కూడా తన ఉద్యోగులను తొలగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.