CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ముంపు ప్రాంతాల సమస్యలు విని, పరిష్కరించేందుకే తాను వచ్చానని సీఎం జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం…
ఏపీలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఓ మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను స్థానికులు వెంటనే చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.…