నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అల్లూరి 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నారు.
దేశం కోసం, దేశ ప్రజలకు స్వేచ్ఛ కోసం అతి చిన్న వయస్సులోనే ప్రాణాలర్పించిన గొప్ప పోరాట స్ఫూర్తి ప్రధాత అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురష్కరించుకుని రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సభలో సోము వీర్రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద చిత్రపటాలకి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డితో కలిసి వీర్రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. Also Read: Pawan…
సూపర్‌స్టార్ కృష్ణ గురించి చెప్పగానే.. ఆయన అభిమానులు కానీ వారికి కూడా గుర్తొచ్చే చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.
భీమవరంలో జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు పవన్ రాకపోవడాన్ని తప్పుపట్టారు మంత్రి ఆర్కే రోజు.. ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినా టైం లేక రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అంటున్నారు.. మన్యం వీరుడికి పవన్ ఇచ్చిన విలువ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు
త్వరలోనే హైదరాబాద్ లోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు.…
విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాది పాటు వాడవాడలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. భీమవరంలో వచ్చే నెలలో జరిగే అల్లూరి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…
రచయితల టైటిల్ కార్డ్ చూసి కూడా జనం చప్పట్లు కొట్టే రోజులు అప్పట్లోనే ఉండేవి. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో త్రిపురనేని మహారథి సైతం చోటు సంపాదించారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ‘నేరుగా కథ చెప్పడమే’ ప్రధానంగా ఉండేది. కానీ, అందులోనూ స్క్రీన్ ప్లే ను చొప్పించి మరింత రంజింప చేయవచ్చునని కొందరు రచయితలు తలచారు. వీరందరూ పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో అలా రాస్తున్నారనీ కొందరు విమర్శించేవారు. అయితే భవిష్యత్ లో ‘స్క్రీన్ ప్లే’కు విశేషమైన స్థానం…