50 Years For Superstar Krishna’s Alluri Sitarama Raju: తెలుగు చిత్రసీమలో మాస్ హీరోగా తనదైన బాణీ పలికించిన కృష్ణ ‘హీరో’ కృష్ణగా, నటశేఖర కృష్ణగా, ఆ పై సూపర్ స్టార్ కృష్ణగా సాగారు. తెలుగునాట 325 పై చిలుకు చిత్రాల్లో నటించిన నటునిగా ఓ రికార్డు సాధించారు. తెలుగు సినిమా రంగానికి సాంకేతికంగా సినిమాస్కోప్, టెక్నికలర్ వంటి అంశాలను అందించిన ఘనత కూడా కృష్ణ సొంతం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు కృష్ణ. ఆయన నటవారసుడిగా మహేష్ బాబు సైతం జనాన్ని ఆకర్షిస్తూ సక్సెస్ రూటులో సాగుతున్నారు. ఇక సూపర్‌స్టార్ కృష్ణ గురించి చెప్పగానే.. ఆయన అభిమానులు కానీ వారికి కూడా గుర్తొచ్చే చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. తెలుగుజాతి పౌరుషాన్ని బ్రిటిష్ పాలకులకు చవిచూపించిన ఆ మన్నెం వీరుడి కథ సినిమా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. ఎంతో మంది ప్రయత్నించి వదిలేసిన ఈ కథను అద్భుతంగా తెరకెక్కించి చరిత్రలో నిలిచిపోయారు సూపర్ కృష్ణ.
Indraja Shakar: పెళ్ళైన నెల రోజులకే విడాకులు.. నటి సంచలన వ్యాఖ్యలు!
తెలుగులో పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న తొలి సినిమా స్కోప్, ఈస్ట్‌మన్ కలర్ సినిమా కూడా ఇదే. 1955లో ఎన్టీఆర్.. అల్లూరిపై సినిమా తీయాలని కథ తయారు చేసి, 1957 జనవరి 17న వాహినీ స్టూడియోలో ఒక పాట కూడా రికార్డు చేసి ‘విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఎప్పటికప్పుడు నిర్మాణం వాయిదా పడుతూ రాగా ఆ తర్వాత అల్లూరిపై కృష్ణ దృష్టి పడింది. సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదని భావించి సొంత బ్యానర్‌పై తీసేందుకు ముందడుగు వేశారాయన. ఎన్టీఆర్ పిలిపించి నేనా సినిమా చేస్తున్నా, మీరు ఆ సినిమా తీయొద్దన్నా వినలేదు. పైగా నిర్మాణంలో కృష్ణకు అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా తట్టుకుని సినిమాను పూర్తిచేశారు. విజయా అధినేతల్లో ఒకరైన చక్రపాణి ఫస్ట్ కాపీ చూసి ఇంత గొప్ప పాత్రలో కృష్ణను చూసిన ప్రేక్షకులు రెండేళ్ల దాకా మరే పాత్రలోనూ చూడలేరని, ఆ సమయంలో వచ్చే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని చెప్పగా ఆ మాట అక్షరాలా నిజమైంది. నిజానికి ఎన్టీఆర్ మాత్రమే కాదు ఏఎన్నార్, అక్కినేని సైతం ఈ పాత్రతో సినిమా చేయడానికి ఆసక్తి చూపారు. అప్పటి స్టార్ రైటర్, డైరెక్టర్ త్రిపురనేని మహారథి ఈ సినిమా కోసం స్క్రిప్ట్ రాయాలని మిగతా సినిమాలన్నీ పక్కన పెట్టేశారు.