AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటు పార్టీల మధ్య పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎంట్రీతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) శనివారం చెప్పారు. బీజేపీతో తన పొత్తలో అన్నాడీఎంకే పెద్దన్న అని చెప్పారు.
2024 ఎన్నికల్లో ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు. గెలుపు కోసం ఐదేళ్ళు ఎదురు చూసిన కొందరు పొత్తు ధర్మంలో భాగంగా అప్పటిదాకా తాము వర్కౌట్ చేసుకున్న సీట్లను జనసేనకు వదులుకోవాల్సి వచ్చింది. సర్దుకుపోవాల్సిందేనని పార్టీ పెద్దలు తెగేసి చెప్పడంతో టిడిపి సీనియర్లు సైతం నోరుమెదపలేకపోయారు అప్పట్లో. అంత వరకు ఓకే అనుకున్నా... ఆ తర్వాతే అసలు టెన్షన్ మొదలైందట. నాడు సీట్లు త్యాగాలు చేసిన వారికి తగిన గుర్తింపు…
సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం మాట్లాడుకున్నారు? ఇద్దరి భేటీపై ఎందుకు ఆసక్తి రేగుతోంది? ఉండవల్లి తదుపరి రాజకీయం ప్రయాణం ఏంటి? కేసీఆర్, ఉండవల్లి రాజకీయంగా కలిసి నడుస్తారా? లెట్స్ వాచ్..! కేసీఆర్‌తో ఉండవల్లి భేటీపై ఆసక్తికర చర్చ ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్‌గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్‌గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా…
ఏపీలో 2024 కి ముందే ఎన్నికలు రానున్నాయా? వస్తే ఆయా పార్టీల పరిస్థితి ఎలా వుండబోతోంది. పొత్తుల విషయంలో బీజేపీ. టీడీపీ, జనసేన ఏం చేయబోతున్నాయి. ఏపీ పాలిటిక్స్ ని డిసైడ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్ లో ఉందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతలు సమావేశమై కీలకంగా చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటుగా పార్టీ ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, కీలక నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా వైసీపీ విషయంలో భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ జరిగిందని…
ఏపీలో ఇంకా ఎన్నికలు టైం వుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ముందస్తు ముహూర్తాలు పెట్టేస్తోంది. వైసీపీ నేతలు కూడా ముందస్తు మాట ఎత్తకుండానే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 2024 కి కంటే ముందు ఎన్నికలు జరిగినా. జరగకపోయినా ఏపీలో మాత్రం పొత్తులు వుంటాయనేది జగమెరిగిన సత్యం. బీజేపీ-జనసేన కలిసి నడుస్తాయని బీజేపీ నేతలే ఎక్కువగా ప్రకటిస్తున్నారు. తాజాగా అమరావతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన-బీజేపీ…
ఏపీలో పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ పొత్తుల మీదే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ప్రజాసమస్యలు వదిలేసి మూడు ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని.. ఇప్పటి నుంచే పొత్తుల గురించి చర్చలు ఎందుకుని హర్షకుమార్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు జనసేన అధినేత పవన్…