పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందా? కర్రవిరగలేదు.. పాము చావలేదు.. అన్నట్టుగా తయారైంది జనసేనాని హస్తిన పర్యటన. ఢిల్లీలో ఎంత తిరిగినా ఫలించలేదు జనసేన నేత పవన్ కల్యాణ్ పొత్తు రాయబారం. టిడిపి తో పొత్తుకు విముఖతతో ఉంది బీజేపీ నాయకత్వం. జేపీ నడ్డాతో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్. ఈసమావేశంలో పాల్గొన్నారు ఏపి బిజేపి వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్, “సంఘటనా కార్యదర్శి” శివప్రకాశ్. మురళీధరన్ తో నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం రెండు సార్లు సమావేశమయ్యారు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.
నిన్న రాత్రి “సంఘటనా కార్యదర్శి” శివప్రకాశ్ తో కూడా సమావేశమైన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్…పొత్తు విషయంలో ఎలాంటి ప్రగతి సాధించలేకపోయారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో వివిధ పార్టీల బలాబలాలను మురళీధరన్, శివప్రకాశ్ లకు వివరించారు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్. టిడిపి తో పొత్తు రాజకీయంగా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు లాభిస్తుందని గట్టిగా ప్రతిపాదించిన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్. జేపి నడ్డాకు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ మనోగతాన్ని తెలియజేశారు మురళీధరన్, శివప్రకాశ్. జేపీ నడ్డాతో కూడా నేరుగా టిడిపి పొత్తు ప్రతిపాదన పై చర్చించనున్నారు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్. అలాగే, భవిష్యత్ కార్యాచరణ పై బిజేపి నాయకత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో ససేమిరా అంటోంది.
ఇదిలా ఉంటే.. పొత్తుల సంగతి కాసేపు పక్కన పెడితే పవన్ తన పర్యటనలో కేంద్రమంత్రుల్ని కలిశారు.పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తికి కేంద్రమే చొరవ తీసుకోవాలి. పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. నిర్వాసితులకు పునరావాసం అమలుపైనా దృష్టి పెట్టడం లేదు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో చర్చించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.
Read Also: DC vs GT: కష్టాల్లో ఢిల్లీ.. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఇలా..