తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి జరిగిన అత్యవసర సమావేశం అనంతరం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని నిర్ణయంపై ఆసక్తిగా మారింది శ్రీలంక రాజకీయం. రాజీనామా చేసిన వారిలో ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే కుమారుడు క్రీడా శాఖమంత్రి నమల్ రాజపక్సే కూడా వున్నారు. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు కూడా వుంటారు. రాజకీయ సుస్థిరతను కొనసాగించేందుకు కొత్త తాత్కాలిక…