మానవునికి అందుబాటులో ఉన్నదానికంటే అందని దాని మీదనే ఎక్కువ మక్కువ. తెలియని రహస్యాలని చేదించాలనే ఆసక్తి మనిషిని అంతరిక్షం వైపు అడుగులు వేయించింది. ఆ నిశిలో ఏ నిగూడ రహస్యం దాగిందో అని భూమి మీద ఉన్న మనిషి వెతుకులాట. ఆ వెతుకులాటలో ఎన్నో కొత్త విషయాలను వెలికి తీశారు. వెలుగు చూసిన రహస్యాలు ఇసుక రేణువంత అయితే బయటపడని రహస్యాలు ఖగోళమంత.
ఏలియన్స్ ఉన్నాయా? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా? అనే అంశాలపై చాలా కాలంగా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న కచ్చితమైన ఆధారాలను ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేక పోయారు. ఏలియన్స్ గురించి ఊహాజనిత విషయాలను చాలా మంది చెప్పారు.
భూమిలాంటి గ్రహాలు ఈ విశాలమైన విశ్వంలో అనేకం ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఒకవేళ గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉంటారు. వారు మనుషుల కన్నా టెక్నికల్‌గా అభివృద్ధి సాధించిన వ్యక్తులా లేదా, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నాసా ఎప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే గ్రహాంతరవాసుల జాడను కనుగొని తీరుతామని నాసా చెబుతున్నది. దీనికోసం 24 మంది పూజారుల సహాయం తీసుకోబోతున్నది. వివిధ మతాలకు చెందిన నిష్ణాతులైన పూజారులను దీనికోసం వినియోగించుకోబుతున్నది నాసా.…
ఏలియన్లు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాలు విశాలమైన విశ్వంలో చాలా ఉన్నాయని అయితే, వాటిని గుర్తించడం ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2 వ తేదీన అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఓ నల్లని వస్తువు కనిపించిందని, దీని నుంచి రేటియో సిగ్నల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 1930 నుంచి ఆ నల్లని వస్తువు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయని…
ఇటీవలే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. బ్లూఆరిజిన్ సంస్థ తయారు చేసిన న్యూషెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్‌తో పాటుగా ఆయన సోదరుడు మార్క్, మరో ఇద్దరు కూడా అంతరిక్షంలోకి వెళ్లారు. వీరు భూమి మీద నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావడానికి పట్టిన సమయం 11 నిమిషాలు. అయితే, ఇప్పుడు కొందరు ఓ వితండ వాదానికి తెరతీశారు. అమెజాన్ బాస్ జెఫ్ అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత ఆయన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసి ఆయన…