Akkineni Nageswara Rao Statue to be Unvield Tomorrow: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తన డెబ్బై ఐదేళ్ల కెరీర్ లో అనేక క్లాసిక్ చిత్రాలలో నటించి సినీ పరిశ్రమ చరిత్రలో చిరస్మరణీయులుగా ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. అదే సమయంలో నటుడిగానే కాకుండా.. స్టూడియో అధినేతగా, నిర్మాతగా అభిరుచిని చాటుకున్న అక్కినేని జయంతి వేడుక సెప్టెంబర్ 20న జరగనుంది. ఆ వేడుకను పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అక్కినేని…
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ముందుగా గుర్తుకు వస్తారు. ఆయన నటజీవితంలో పలు మేలుమలుపులన్నీ నవలాచిత్రాలే కావడం విశేషం. ఏయన్నార్ ను మహానటునిగా నిలిపిన ‘దేవదాసు’ చిత్రం శరత్ చంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆ తరువాత బెంగాలీ నవలలతోనే ఏయన్నారు మంచి విజయాలను చవిచూశారు. మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ ఆధారంగా రూపొందిన ‘అర్ధాంగి’లో అక్కినేని పిచ్చివాడుగా చేసిన అభినయం ఆకట్టుకుంది. మరో మహానటుడు యన్టీఆర్ తో…