పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్‌ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు మృతిచెందాడు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్రదాడులతో ఉద్రిక్తంగా ఉంది. వలస కూలీలు, ఆర్మీ జవాన్లు టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ కనిపించడంతో ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపి డ్రోన్‌ను కూల్చివేశారు. ఈ డ్రోన్‌కు 5 కేజీల ఐఈడీ బాంబు అమర్చి ఉండటంతో వెంటన్ ఆర్మీ అధికారులు ఆ డ్రోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెద్ద విధ్వంసం జరిగి ఉండేదని, ఈ డ్రోన్ కుట్ర వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద హస్తం ఉండి ఉంటుందని ఆర్మీ…