త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రామరాజ్యాన్ని స్థాపిస్థానని శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వచ్చి చెప్తున్నాడని అఖిలేష్ వ్యాఖ్యానించారు. రామరాజ్యానికి సామ్యవాదమే మార్గమని… సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల ‘ఉచిత’ హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితమని ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ప్రకటించారు. Read Also:ప్రధాన మంత్రి…
యూపీలో ఎన్నికల వేడి రగులుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా…
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది యూపీలో నేతలు అప్పుడే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వాలు మొదలెట్టేశారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రలోభాలకు తెరలేపింది. యూపీ సీఎం యోగి…
యూపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. 2022లో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో మొత్తం నాలుగు సార్లు వేర్వేరు చోట్ల వివిధ ప్రచార కార్యక్రమాలకు మోడీ హాజరవుతారు. ఇవి డిసెంబర్ 18-28 మధ్య రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ప్రభుత్వం వివిధ దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా వాడుకుంటోందని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. కొందరు ఎస్పీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ…
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ నేతలు ఓట్ల కోసం పడేపాట్లు అంతా ఇంత కాదు… ఎప్పటికప్పుడు వినూత్న తరహాలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.. డబ్బులు, మద్యం.. ఇలా ప్రలోభాలకు కూడా తక్కువేం కాదనే చెప్పాలి. ఇక, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. యూపీలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ ఓవైపు.. సమాజ్‌వాది పార్టీ ఇంకో వైపు వారి ప్రయత్నాలు చేస్తున్నాయి.. అయితే, ఎస్పీ ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నమే…
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను మహాత్మా గాంధీ, సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌లతో పోల్చారు, వారందరూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని అన్నారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ (మహమ్మద్ అలీ) జిన్నా ఒకే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. వారు న్యాయవాదులుగా మారి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సిద్ధాంతంపై…
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. పార్టీలన్నీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా.. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాలంటున్నారు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్.. ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని కోరిన ఎన్సీపీ చీఫ్.. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) పొత్తుతో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే,…
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్టర్లో పెట్టి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది. చాలా మంచి విషయం చెప్పారనీ, గతంలో అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్‌గా పేర్కొంటూ విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను ములాయం సింగ్ తీసుకున్నారని, త్వరలోనే అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని…