సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శనివారం సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయిన ఆయన రెండున్నర గంటల పాటు దేశ రాజకీయాలపై ముచ్చటించారు. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. తాజాగా ఈ రోజు సీఎం చంఢీగడ్ వెళ్లనున్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు…
దేశంలో విద్యావ్యవస్థ తీరుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యావిధానం పూర్తిగా ఏక పక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంపై రాష్ట్రాలతో సంప్రదించలేదని అన్నారు. తెలంగాణలో విద్యా విధానాన్ని మార్పు చేస్తామని అన్నారు. దేశంలో సెన్సేషన్ జరగాలి… జరుగుతుంది అని కేసీఆర్ అన్నారు. రాబోయే…
BJP is leading in the 2022 Uttar Pradesh Assembly elections. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటిండ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పైనే అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో యూపీలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. అందుకు అనుగుణంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. యూపీలో 403 స్థానాలకు…
ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీలిచ్చే పనిలో పడ్డాయి. తాజాగా యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కొత్త హామీని ప్రకటించింది. మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు ఉచిత రేషన్‌తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని ప్రకటించారు. పేదల…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.. సమాజ్‌వాది పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ నేతలు తలకు పెట్టుకునే ఎరుపు టోపీనే టార్గెట్ చేసిన ఆయన.. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని ఆరోపణలు గుప్పించారు.. ఇదే సమయంలో 1500 మందికి పైగా హిందువులను జైళ్లలో పెట్టారని.. సమాజ్‌వాదీ పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారంటూ వ్యాఖ్యానించారు..…
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది.. ఆదిలోనే అధికార బీజేపీకి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజకీయ వలసలకు తెరలేపారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. దీంతో షాక్ తిన్న కమల దళం.. తేరుకుని.. అఖిలేష్ ఫ్యామిలీ నుంచి వలసలను ప్రోత్సహించింది.. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి ఇద్దరికి బీజేపీ కండువా కప్పింది.. ఈ వ్యవహారంపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. మొదటగా భారతీయ జనతా…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష ఎస్పీ.. ఇంకో వైపు కాంగ్రెస్, మరోవైపు బీఎస్పీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. అందేంటి? బీజేపీకి వరుసగా షాక్‌లు ఇస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ.. ఎస్పీ గూటికి క్యూ కడుతోన్న సమయంలో.. అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు…
ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కుల ప్రాతిపదికన ఏర్పడిన ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఓబీసీ, దళిత కమ్యూనిటీలకు అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను కులాలే నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఆ కుల పార్టీలలో కూడా చీలికల వర్గాలను మనం చూడవచ్చు.…
త్వరలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వలసలు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఒక మంత్రి సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీలో చేరారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ గుర్తు సైకిల్ అని అందరికీ తెలిసిన విషయమే. అఖిలేష్ యాదవ్ ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి వలసలు పెరిగిపోవడంతో బీజేపీలో గుబులు మొదలైంది. Read…
మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్‌లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో…