INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆప్, సమజ్ వాదీ(ఎస్పీ) పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిని కట్టాయి. అయితే ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని విపక్ష పార్టీ ఒక్కతాటిపై నిలిచి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్తర ప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే - ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది.
మణిపూర్‌లో జీ20 ఈవెంట్‌ను నిర్వహించకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశ్నలు సంధించారు. జీ20 సమ్మిట్‌ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొంటే జీ20 సదస్సును అక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
శుక్రవారం బీహార్‌లోని పాట్నాలో నాలుగు గంటలపాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమా నిర్ణయించుకున్నారు.
దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు పొందేందుకు AAP చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా సీఎం కేజ్రీవాల్ రేపు అఖిలేష్ తో భేటీకానున్నారు.
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ ఎన్ కౌంటర్ పై ఉత్తర్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్రంలోని విపక్ష పార్టీలు యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ అంశంపై విపక్ష సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది.
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత ఫిబ్రవరిలో చంపేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్ కొడుక అసద్ అహ్మద్, అతని అనుచరుడు గులాం కీలక నిందితులుగా ఉన్నారు.
Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Mamata Banerjee-Akhilesh Yadav New Front Without Congress: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు తమ ఎన్నికల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ చీఫ్ మమతా బెనర్జీని కోల్‌కతాలో కలిశారు. ఇరువురు నేతల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న…