Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసు విచారణలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా హాజరుకావాలని సమన్లలో కోరారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ని రేపు దర్యాప్తు సంస్థ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అఖిలేష్ 2012 నుంచి జూన్, 2013 మధ్య మైనింగ్ శాఖను నిర్వహించాడు.
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా మీదుగా సాగుతున్న యాత్రలో అఖిలేష్ యాదవ్ చేరారు. రెండు…
ఇండియా కూటమికి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ తర్వాత లోక్‌సభ స్థానాల పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్‌లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు మాకంటే మాకు అన్నట్లుగా వ్యవహరించాయి. దీంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు…
ఉత్తరప్రదేశ్‌లోని 16 లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌కు 11 సీట్లు కేటాయించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
INDIA bloc: వరసగా ఇండియా కూటమిలో అసంతృప్తులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మమతా బెనర్జీ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పారు. మరోవైపు ఆప్ కూడా పంబాబ్, ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. ఇక బీహార రాజకీయాలు ఇండియా కూటమి ఉంటుందా..? ఉండదా..? అనే సందేశాలను లేవనెత్తింది. సీఎం నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీకి, కాంగ్రెస్ పార్టీకలు చేయిచ్చి బీజేపీతో కలవబోతున్నారు.
Akhilesh Yadav: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్ లోని మహాఘటబంధన్ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో సమాజ్‌వాదీ(ఎస్పీ) నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఉండి ఉంటే ఆయన ప్రధాని యఅ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Swami Prasad Maurya : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ బ్రాహ్మణ సదస్సులో ఇచ్చిన హామీ 24 గంటలు కూడా నిలవలేదు. హిందూ మతానికి సంబంధించి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
INDIA bloc: ప్రతిపక్షాల ఇండియా కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 19న ఢిల్లీ వేదికగా కూటమి నాలుగో సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షత వహించబోతోంది. ముందుగా ఈ సమావేశాన్ని గత బుధవారం నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే కీలక నేతలైన సీఎం మమతాబెనర్జీ, సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి వారు గైర్హాజరు అయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీని రద్దు చేశారు.