Akhilesh Yadav: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్ లోని మహాఘటబంధన్ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో సమాజ్‌వాదీ(ఎస్పీ) నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఉండి ఉంటే ఆయన ప్రధాని యఅ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Also: TS News: ఖైదీలకు గుడ్‌న్యూస్.. జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారంటే..!
ఓ జాతీయ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో ఎవరైనా ప్రధాని పోస్టుకి పరిగణించవచ్చు, నితీష్ కుమార్ సరైన మద్దతుతో పోటీదారుగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. మళ్లీ బీజేపీతో నితీష్ కుమార్ కలుస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్జేడీతో జేడీయూ బంధం విచ్ఛిన్నమైందనే వార్తల నేపథ్యంలో జనవరి 28న బీజేపీ మద్దతుతో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ఇండియా కూటమిలోనే ఉండాలని అఖిలేష్ యాదవ్ కోరారు. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు అసంతృప్తితో ఉన్నసమయంలో కాంగ్రెస్ చొరవ చూపించాల్సి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ప్రధాని పదవి కోసం పోటీ పడటం లేదని, ప్రాంతీయ పార్టీలు తమకు ఎక్కువ బలం ఉన్న చోట ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ కోరారు.