బోయపాటి శ్రీనుకు మళ్లీ మంచిరోజులొచ్చాయి అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలవారు. వినయ విధేయ రామ చిత్రంతో డిజాస్టర్ ని అందుకున్న బోయపాటి ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తనకు విజయాలను తెచ్చిపెట్టిన బాలయ్యతో మూడో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కసిని అంతా మాస్ యాక్షన్ గా మలిచి అఖండ లో చూపించాడు. అఖండ విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది.. దీంతో బోయపాటి కల ఫలించి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాను నైజాంతో పాటు ఏపీలోని వైజాగ్ ఏరియాకు నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా పంపిణీ చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సినిమా ద్వారా లాభాలను చవిచూడటంతో దిల్ రాజు అఖండ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు…
కరోనా సంక్షోభం మధ్య ఈ డిసెంబర్‌లో అనేక తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన “అఖండ” చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలను ఆస్వాదించడానికి జనాలు ఎలాంటి సమయంలోనైనా ఇష్టపడతారని “అఖండ” రోరింగ్ సక్సెస్ నిరూపించింది. తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్ర విజయం బలాన్నిచ్చింది. తాజాగా “అఖండ” చిత్ర…
నటసింహం నందమూరి బాలకృష్ణ “అఖండ” థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమాతో “అఖండ” జాతర జరుపుకుంటున్నారు. సినిమా విడుదలై మూడు నాలుగు రోజులు అవుతున్నా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనే చెప్పాలి. ఇలా ఒకవైపు హీరో బాలకృష్ణ “అఖండ” చిత్రంలో తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో వెండితెరపై ఫైర్ సృష్టిస్తుంటే… మరోవైపు “అఖండ” ప్రదర్శితం అవుతున్న మరో థియేటర్లో నిజంగానే అగ్ని ప్రమాదం…
గురువారం విడుదలైన ‘అఖండ’ సినిమా అఖండ విజయాన్ని అందుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. అఖండ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఒక అభిమాని గుండె ఆగింది. ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ బాలకృష్ణకు వీరాభిమాని.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 2 అఖండ రిలీజ్ కావడంతో ఫస్ట్ డే ఫస్ట్ షో స్థానిక శ్యామల థియేటర్‌లో చూడడానికి వచ్చాడు. అప్పటివరకు జై…
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే… కాపీ క్యాట్ అని హేళన చేసినవారే ఇప్పుడు ఆయనకు బ్రహ్మ రధం కడుతున్నారు. ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నా థమన్ కృంగిపోకుండా నిలబడి విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవల థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఇక ఇటీవల థమన్ సంగీతం అందించిన అఖండ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అఖండ విజయంలో థమన్ పాత్రే ఎక్కువ ఉందంటే అతిశయోక్తి కాదు..…
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య అరుపులు మారుమ్రోగిపోతున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూడడానికి నిజమైన అఘోరాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో ఇద్దరు అఘోరాలు సందడి…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ్ ను షూట్ చేస్తారని షో సన్నిహిత వర్గాల సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి.…
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ గురించే చర్చ.. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని భారీ రికార్డులను కొల్లగొట్టే దిశలో పడిగెడుతుంది. థియేటర్లు ఓపెన్ అయ్యాకా విడుదలై మంచి వసూళ్లు రాబట్టి మిగతా సినిమాలకు అఖండ నమ్మకమనే గేట్లను ఎత్తింది. ఇక ఈ సినిమా విజయంపై టాలీవుడ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన పలువురు స్టార్ హీరోలు తమ స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.…
‘అఖండ’ సినిమా విడుదల అనంతరం నందమూరి ఎన్టీయార్ తనయుడు, మనుమలు, వారసులు ఒక్కక్కరూ ఆ సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘పెద్దన్నయ్య, గొప్పింటి అల్లుడు’ చిత్రాలను నిర్మించిన తమ్ముడు నందమూరి రామకృష్ణ సైతం తన స్పందన తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటన ఇది: ”గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న’ అఖండ’ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్శింపబడుతున్నది. మళ్లీ…