నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బోయపాటి ఇందులో బాలయ్యను అఘోరిగా చూపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక బాలయ్య హావభావాలు, డైలాగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా బాలయ్య ‘అఖండ’ టైటిల్ రోర్…