నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బోయపాటి ఇందులో బాలయ్యను అఘోరిగా చూపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక బాలయ్య హావభావాలు, డైలాగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా బాలయ్య ‘అఖండ’ టైటిల్ రోర్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ చిత్రం. తాజా అప్డేట్ ఏంటంటే… ‘అఖండ’ శాటిలైట్ హక్కులను స్టార్ మా, డిజిటల్ రైట్స్ ను హాట్ స్టార్ సుమారు 15 కోట్ల భారీ రేటుకు సొంతం చేసుకున్నాయట. ఇది బాలయ్య కెరీర్లోనే భారీ డీల్ కావడం విశేషం. మరోవైపు 28 మిలియన్ల వ్యూస్ ను దాటేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు 370కే లైక్స్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తోంది ‘అఖండ’ టైటిల్ రోర్. ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘అఖండ’ మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.