నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడి, ఇప్పుడు డిసెంబర్ 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. అంటే, టికెట్ బుకింగ్‌లు ఈరోజే (డిసెంబర్ 10) ప్రారంభం కావాలి. కానీ, గతంలో ఎదురైన సమస్యే ఇప్పుడు మళ్లీ అభిమానులను కలవరపెడుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో బుకింగ్స్ విషయంలో ఎలాంటి సమస్య…