న్యూజిల్యాండ్ బౌలర్ అజాజ్ పటేల్ గుర్తున్నాడా? క్రికెట్ ప్రియులకు కచ్ఛితంగా గుర్తుంటాడు. గతేడాది డిసెంబర్‌లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో అజాజ్ పది వికెట్లు తీసి చరిత్రపుటలకెక్కాడు. ఏ జెర్సీతో అయితే అతడు ఆ ఫీట్ సాధించాడో, ఇప్పుడదే జెర్సీని వేలం వేయబోతున్నాడు. దీని వెనుక దాగి ఉన్న ఓ చిన్న కథను కూడా అతడు రివీల్ చేశాడు గతేడాది తన కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడగా, న్యూజిల్యాండ్‌లోని స్టార్‌షిప్…