టీమిండియా ఫురుషుల సెలెక్షన్ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీలో టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్ అజయ్ రాత్రా సరికొత్త సభ్యునిగా నియమితులయ్యారు. సలీల్ అంకోలా స్థానంలో అతడికి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అగార్కర్, అంకోలా ఇద్దరూ వెస్ట్ జోన్‌కు చెందినవారే కావడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చింది. సంప్రదాయం ప్రకారం బీసీసీఐ సెలక్షన్ కమిటీలో అయిదుగురు సభ్యులు వివిధ జోన్లకు ప్రాతినిధ్యం…