Air Pollution: భారత్‌కే కాదు పొరుగు దేశం పాకిస్థాన్‌కు కూడా కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో కాలుష్యం ప్రజలకు సమస్యగా మారింది. ఎమర్జెన్సీని కూడా ప్రభుత్వం విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై ఢిల్లీ సహా ఎన్‌సీఆర్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి అఫిడవిట్‌లను కోర్టు కోరింది.
Air Pollution: వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నోయిడా, ఘజియాబాద్‌లలో గాలి నాణ్యత చాలా దారుణమైన స్థితికి చేరుకుంది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మూడున్నర నెలల తర్వాత మరోసారి దిగజారింది. రాజధానిలో చాలా ప్రాంతాలలో గాలి నాణ్యత అధ్వాన్నంగా, ఆందోళనకర స్థితికి చేరుకుంది. గాలి నాణ్యతకు సంబంధించి ఢిల్లీలో సృష్టించబడిన 13 హాట్‌స్పాట్‌లలో 11 వద్ద గాలి నాణ్యత పేలవమైన కేటగిరీలో ఉన్నట్లు కనుగొనబడింది.
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
Delhi Air Pollution: చలికాలంలో రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. అప్పటికి పంట పూర్తి కావడం.. దీంతో పొలాల్లోని మొలకలను రైతులు తగలబెట్టడం వల్ల పొగ విపరీతంగా గాల్లోకి చేరి కాలుష్యం ఏర్పడుతుంది.
హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతుంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో పాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి.
Nitin Gadkari: ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగమే మేలు అని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
అమెరికాలోని న్యూయార్క్ ఆకాశమంతా ఆరెంజ్ రంగులోకి మారింది. అమెరికా ఆర్థిక రాజధాని అయిన ఈ సిటీని పొగమంచు ముంచెత్తడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం నేపథ్యంలో ఆడ నగర మేయర్ ఎరిక్మ్స్ వాయుకాలుష్య హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
న్యూయార్క్ నగరం దట్టమైన పొగతో కమ్ముకుని ఉంది. మంగళవారం అక్కడి ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోయారు. సాయంత్రం వరకు నగరం మొత్తం దట్టమైన పొగతో కప్పేసింది. న్యూయార్క్ నగరం ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి కారణమేంటంటే.. కెనడాలో కార్చిచ్చు ప్రభావంగా నగరం మొత్తం ఈ పరిస్థితికి దారితీసింది.