కొన్నేళ్ల నుంచి ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సహజంగానే అది అందులో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. జీతాల్లో కోత…చెల్లింపులో ఆలస్యం..ఉద్యోగుల తొలగింపు వంటివి ఎలాగూ ఉంటాయి. వేల కోట్ల అప్పుల భారంతో ఉన్న సంస్థకు ప్రభుత్వం ఇక ఏమాత్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఎయిరిండియా ఉద్యోగులకు ఎప్పుడో అర్థమైంది. దాంతో కొంత కాలంగా వారు భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. లక్ష కోట్ల మేర రుణ భారంతో కుంగిపోయిన ఉన్న ఎయిర్ ఇండియా అమ్మకానికి 2018లో…
రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్..…