Air India Crash: జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఈ విమానం, టేకాఫ్ అయన 30 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులే కాకుండా నేలపై ఉన్న పలువురు మరణించారు. అయితే, దర్యాప్తులో ఇంజన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లపై పరిశోధకులు దృష్టి సారించిందని ప్రముఖ ఏవియేషన్ జర్నల్ ది…
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక జూలై 11 నాటికి విడుదల కానుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. నేలపై ఉన్న మరో 34 మంది చనిపోయారు. వచ్చే వారం విడుదల కాబోయే ప్రాథమిక రిపోర్టు కీలకంగా మారబోతోంది. 4-5 పేజీల నిడివి ఉంటుందని భావిస్తున్న ఈ డాక్యుమెంట్‌లో ప్రమాదానికి సాధ్యమయ్యే కారణాలతో సహా అనేక కీలక విషయాలు ఉండనున్నాయి.
Air India Plane Crash: గత నెలలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో 242 మంది ప్రయాణికులతో పాటు, నేలపై ఉన్న 34 మంది వ్యక్తులు మరణించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన 30 సెక్షన్లలోపే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 181 మంది భారతీయులు మరణించగా, 52 మంది యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు చెందిన వారు ఉన్నారు.
Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై వేగంగా దర్యాప్తు సాగుతోంది. జూన్ 12న 275 మంది మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విమాన ప్రమాదానికి కారణాలు వెల్లడించే విషయంలో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్‌లోడ్ చేశారు.
Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగా, DNA పరీక్షల ద్వారా ఇప్పటివరకు 163 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 124 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. దీనితో వాటిని గుర్తించడానికి పెద్ద సమస్యగా మారింది. దాంతో అధికారులు DNA పరీక్షలతోనే గుర్తింపు ప్రక్రియను…
Air India crash Investigation: గత వారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని డాక్టర్స్ హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 270 మంది మరణించారు. అయితే, ప్రమాదానికి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం కారణమని పలువురు భావిస్తున్నారు. ఇంజన్ ఫెయిల్యూర్‌తో పాటు విద్యుత్ లేదా హైడ్రాలిక్స్ పనిచేయదని అంచనా వేస్తున్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదం అనంతరం భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది.