గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 241 మంది మృతిచెందగా ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది. Also Read:Ahmedabad Plane…
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు (ఇందులో అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ రెసిడెంట్ వైద్యులు కూడా ఉన్నారు) ఒక్కొక్కరికి రూ.50 లక్షల మధ్యంతర పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా విమానం AI171 దుర్ఘటన వందలాది మంది కుటుంబాల్లో విషాదం నింపింది. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తు్న్న వారు 240 మంది మృతిచెందారు. పెను విషాదం చోటుచేసుకోవడంతో ప్రపంచ లీడర్లు సంతాపం ప్రకటిస్తు్న్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. విమాన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించారు. Also Read:Allu Arjun: మలయాళ సెన్సేషన్ తో బన్నీ సినిమా? ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ…
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని సమాచారం వినిపిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 230 మంది మృతుల్లో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా దేశస్థుడు ఉన్నారు.…