గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 241 మంది మృతిచెందగా ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read:Ahmedabad Plane Crash: అద్భుతం.. ఇనుము కరిగింది కానీ, కానీ క్షేమంగా ఉన్న భగవద్గీత..!
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన బోయింగ్ విమానాలను తనిఖీ చేసి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన నేపథ్యంలో B787-8/9 విమానాల్లో సాంకేతిక పరికరాలను తనిఖీ చేసి, నివేదిక అందించాలని ఎయిర్ ఇండియాకు నోటీసులు ఇచ్చింది. 2025 జూన్ 15 అర్ధరాత్రి (00:00 గంటలు) నుంచి భారత్ నుంచి విమానాలు బయలుదేరే ముందు తప్పనిసరి వన్-టైమ్ స్పెషల్ చెక్ ప్రక్రియను అమలు చేయాలని DGCA ఎయిర్ ఇండియాను ఆదేశించింది.
Also Read:Donald Trump: ‘‘ పరిస్థితి మరింత దిగజారుతుంది’’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
విమానానికి ముందు ఇంధన పారామీటర్ పర్యవేక్షణ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ టెస్ట్, ఇంజిన్ ఫ్యూయల్ యాక్యుయేటర్ ఆపరేషన్, ఆయిల్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్ సర్వీస్ చెక్ వంటి అనేక ముఖ్యమైన సాంకేతిక తనిఖీలను చేపట్టాలని DGCA ఆదేశించింది. దీనితో పాటు, టేకాఫ్‌కు ముందు పారామితులను సరిగ్గా సమీక్షించాలని సూచించింది. దీనితో పాటు, ‘ఫ్లైట్ కంట్రోల్ చెక్’ను రవాణా తనిఖీకి జోడించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని DGCA ఆదేశించింది. గత 15 రోజుల్లో బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాలలో వచ్చిన పునరావృత సాంకేతిక లోపాలు (స్నాగ్‌లు) సమీక్షించాలని, వాటికి సంబంధించిన అన్ని నిర్వహణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.