Air India: ఎయిర్ ఇండియా డీల్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ చేసి ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి టాటా సంస్థ ఎయిరిండియాను చేజిక్కించుకున్న తర్వాత దాని రూపురేఖలే మారిపోనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి ఏకంగా 80 బిలియన్ డాలర్ల డీల్ తో ఎయిరిండియా 470 విమానాలను కొనుగోలు చేయనుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6 లక్షల కోట్లకు పైమాటే.…
విమానయాన రంగంలో సంచలనం చోటు చేసుకుంది. వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది. అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్‌నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. ఎయిర్‌బస్ విమానం గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్…
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవీయేషన్ షో (Wings India Aviation Show) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వివిధ సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన దగ్గర నుంచి ఏర్పాట్లు వరకూ అన్ని ఫెయిలయ్యాయి. దీంతో ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు పెద విరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వింగ్స్ ఇండియా 2022కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో గల అనేక సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించాయి. దేశ, విదేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు…